- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పు చెల్లించలేదని ట్రాక్టర్ ఎక్కించాడు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. నకరికల్లు మండలం శివాపురంలో అప్పు చెల్లించని నేపంలో ఓ వ్యక్తి మహిళపై ఏకంగా ట్రాక్టర్ ఎక్కించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బోనముక్కల శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వద్ద శివాపురంకు చెందిన మంత్రూబాయి దంపతులు పొలం తాకట్టు పెట్టారు. ఈ నేపథ్యంలోనే రూ. 3.80 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తిరిగి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. నకరికల్లు మండలం శివాపురంలో అప్పు చెల్లించని నేపంలో ఓ వ్యక్తి మహిళపై ఏకంగా ట్రాక్టర్ ఎక్కించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
బోనముక్కల శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వద్ద శివాపురంకు చెందిన మంత్రూబాయి దంపతులు పొలం తాకట్టు పెట్టారు. ఈ నేపథ్యంలోనే రూ. 3.80 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తిరిగి చెల్లించడం ఆ కుటుంబానికి ఇబ్బందిగా మారింది. దీంతో డబ్బులు అడిగేందుకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి.. తర్వాత చెల్లిస్తామనడంతో ఏకంగా మంత్రూబాయి మీదకు ట్రాక్టర్ ఎక్కించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాగా, బోనముక్కల శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నేత కావడం గమనార్హం.
Next Story






