- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుల్వామా కారు బాంబు వ్యూహకర్త ఫౌజీ భాయి హతం
<p>శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ కమాండర్ అబ్దుర్ రెహ్మాన్ అలియాస్ ఫౌజీ భాయి సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామాలోని కాంగన్ గ్రామంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా, భారత సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో గత నెల 28న పుల్వామా […]</p>

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ కమాండర్ అబ్దుర్ రెహ్మాన్ అలియాస్ ఫౌజీ భాయి సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామాలోని కాంగన్ గ్రామంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా, భారత సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో గత నెల 28న పుల్వామా తరహా దాడి చేయడానికి కుట్రపన్నిన సూత్రధారి, జైషే సంస్థ కమాండర్, బాంబు తయారు చేయడంలో నిపుణుడైన ఫౌజీ భాయి ఉన్నాడు. కాగా, ఫౌజీ మృతితో జైషే సంస్థకు కోలుకోలేని దెబ్బ పడిందని విజయ్ కుమార్ తెలిపారు. జైషే మహ్మద్ సంస్థలో బాంబు తయారు చేయడానికి ముగ్గురు నిపుణులుండగా, అందులో ఫౌజీ ఒకడని వెల్లడించారు. ప్రస్తుతం మరో ఇద్దరు మాత్రమే ఉన్నట్టు వివరించారు.






