పల్స్ పోలియో కార్యక్రమం వాయిదా

42

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 17న జరగాల్సిన పల్స్ పోలియో కార్యక్రమం వాయిదా పడింది. 17వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాల్సిన పల్స్‌ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. తదుపరి పల్స్ పోలియో కార్యక్రమ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఈ నెల 16 నుంచి పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో పల్స్‌ పోలియా కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.