- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెట్ల కింద అసెంబ్లీ సమావేశం.. మన ఇండియాలోనే
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనాతో వస్తున్న ఇబ్బందులు అన్నిఇన్నికావు. తాజాగా కరోనాతో పుదుచ్చేరి అసెంబ్లీలో ఎన్నడూ చూడని విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఓ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సమావేశాన్ని కాస్తా అసెంబ్లీ అవరణలోని చెట్ల కింద నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విపక్ష సభ్యుడు ఎన్ ఎస్ జే జయబాల్ కు శుక్రవారం కరోనా సోకడంతో అసెంబ్లీ భవనం మొత్తం శానిటైజ్ చేశారు. దీంతో ఇవాళ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనాతో వస్తున్న ఇబ్బందులు అన్నిఇన్నికావు. తాజాగా కరోనాతో పుదుచ్చేరి అసెంబ్లీలో ఎన్నడూ చూడని విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఓ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సమావేశాన్ని కాస్తా అసెంబ్లీ అవరణలోని చెట్ల కింద నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విపక్ష సభ్యుడు ఎన్ ఎస్ జే జయబాల్ కు శుక్రవారం కరోనా సోకడంతో అసెంబ్లీ భవనం మొత్తం శానిటైజ్ చేశారు. దీంతో ఇవాళ జరిగిన సమావేశాన్ని చెట్ల కింద నిర్వహించాల్సి వచ్చింది. ఇక, ఎమ్మెల్యేకి కరోనా సోకడంతో ఇతర సభ్యులంతా 7 రోజుల పాటు స్వీయ నియంత్రణలో ఉండాలని పుదుచ్చేరి సీఎం సూచించారు. ఎల్లుండి శాసనసభ్యులందరికీ కరోనా పరీక్షలు చేయిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి.
Next Story






