- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్లైమాక్స్‌కు పుదుచ్చేరి పాలిటిక్స్.. ఇంకా 9 గంటలే టైం!
<p>రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందుగా ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా కష్టం. ఏ నాయకుడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు. అధికారం కోసం, పదవుల కోసం నమ్మిన వారిని నట్టేట ముంచుతారు. అంతా బాగానే ఉంది అనుకునేలోపే ఏదో ఒక షాక్ తగులుతుంది. ఈ రోజు ఒక పార్టీలో ఉన్నవారు తెల్లారితే ఉంటాడో తెలీదు.. పక్క పార్టీ కండువా కప్పుకున్నవారు.. తమ స్వార్ధం కోసం అదేరోజు సాయంత్రం మరొక పార్టీలోకి జంప్ చేసే అవకాశం లేకపోలేదు. ఇలాంటి […]</p>

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందుగా ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా కష్టం. ఏ నాయకుడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు. అధికారం కోసం, పదవుల కోసం నమ్మిన వారిని నట్టేట ముంచుతారు. అంతా బాగానే ఉంది అనుకునేలోపే ఏదో ఒక షాక్ తగులుతుంది. ఈ రోజు ఒక పార్టీలో ఉన్నవారు తెల్లారితే ఉంటాడో తెలీదు.. పక్క పార్టీ కండువా కప్పుకున్నవారు.. తమ స్వార్ధం కోసం అదేరోజు సాయంత్రం మరొక పార్టీలోకి జంప్ చేసే అవకాశం లేకపోలేదు. ఇలాంటి వారి వల్లే కష్టపడి, ప్రజలను మెప్పించి అధికారంలోకి వచ్చిన పార్టీలు పేక మెడలవలే కుప్పుకూలుతుంటాయి.
దిశ,వెబ్‌డెస్క్ :దేశ రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణం. అధికారంలో ఉన్న పార్టీ తన ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కుంటే.. అదే అదునుగా రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష లేదా ఇతర ఏదైనా పార్టీకి అధికారం దక్కొచ్చు అని తెలిస్తే చాలు. అప్పటివరకు ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపించిన వారు ఆ పార్టీలోకి జంప్ చేసి వీర విదేయులుగా మారిపోతారు. ఇంకొందరైతే అధికార పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని భావించిన వారు అవకాశం కోసం గోడమీద పిల్లిలా ఎదురుచూస్తుంటారు. ఛాన్స్ రాగానే తదుపరి ఏదైతే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందో అందులో చేరి ఏదో ఒక పదవిలో సెట్ అయిపోతుంటారు.‘‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని’’ అందుకే అంటారేమో.
పాలిటిక్స్‌లో తమకు లైఫ్ ఇచ్చిన వారికి విదేయత చూపించే వారికంటే వెన్నుపోటు పొడిచేవారే ఎక్కువగా ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మచ్చుకైనా కనిపించడం లేదంటే ఒట్టు. ‘మనీ’ చుట్టే ప్రజెంట్ పాలిటిక్స్ మొత్తం నడుస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఏర్పాటైన కొద్దినెలల వ్యవధిలోనే అది కూలిపోవడం, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడం చకచకా జరిగిపోతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ మనకు బెస్ట్ ఉదాహరణ నిలుస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే అసెంబ్లీతో కూడిన కేంద్రం పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. 30 స్థానాలు గల పుదుచ్చేరి అసెంబ్లీకి 2016లో ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ కూటమి మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2021 మేలో దాని అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. దీంతో పాటే దేశంలోని మిగతా నాలుగు రాష్ట్రాలు(తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం)తో పాటు పుదుచ్చేరికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సమాయత్తం అవుతోంది.
మరో రెండు నెల్లల్లో ఎన్నికలు జరుగుతాయనే సందర్భంలో పుదుచ్చేరి సీఎం నారాయణస్వామికి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. గతంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 28కి చేరింది. దీంతో సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం మైనార్టీలోకి వెళ్లిపోయింది. 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే (మ్యాజిక్ ఫిగర్ 16 మంది) ఎమ్మెల్యేల సపోర్టు అవసరం. ప్రస్తుతం అసెంబ్లీలో 28 సభ్యులే కావడంతో మ్యాజిక్ ఫిగర్ 15 ఉంటే చాలు. అయితే, అధికార కాంగ్రెస్‌కు 14, ప్రతిపక్ష బీజేపీ 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ లేదు. ఈ నేపథ్యంలోనే పుదుచ్చేరి అదనపు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళి సై సౌందర్ రాజన్ ప్రతిపక్ష సభ్యుల ఫిర్యాదు మేరకు ఈనెల 22న ఫ్లోర్ టెస్టుకు సిద్ధం కావాలని సీఎం నారాయణ స్వామికి డెడ్‌లైన్ విధించింది.
సోమవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇవ్వగా.. కాంగ్రెస్ కూటమి బలనిరూపణ చేయని యెడల ప్రభుత్వం కూలిపోతుంది. ఫ్లోర్ టెస్టు ఎలా నెగ్గాలని ముఖ్యమంత్రి మల్లగుల్లాలు పడుతున్న క్రమంలో.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు నారాయణస్వామికి కోలుకోని షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్, మరో డీఎంకే ఎమ్మెల్యే రాజీనామా ఆదివారం చేశారు. దీంతో కాంగ్రెస్ కూటమి బలం 12కు చేరింది. ఈ దెబ్బతో నారాయణస్వామి ముఖ్యమంత్రి పదవిని కోల్పోనున్నారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అటు ప్రతిపక్ష బీజేపీకి కూడా మ్యాజిక్ ఫిగర్‌కు ఒక్క స్థానం దూరంలో ఉంది. ఎటుచూసినా కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో తమకు మెజార్టీ ఉందని ప్రతిపక్ష బీజేపీ అధికారాన్ని తిరిగి చేపడుతుందా..? లేదా, మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటివరకు పుదుచ్చేరిలో గవర్నర్ పాలన కొనసాగుతుందా..? అనేది తేలాలంటే బలపరీక్ష అయ్యేంత వరకు వేచిచూడాల్సిందే.






