రిపబ్లిక్ డే రోజు మందులో మునిగి తేలిన డీపీఆర్ఓ ఉద్యోగులు

by  |
రిపబ్లిక్ డే రోజు మందులో మునిగి తేలిన డీపీఆర్ఓ ఉద్యోగులు
X

దిశ,వెబ్‌డెస్క్: మందు బాబులం మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం.. అరే కల్లు తాగి గెంతేస్తాం.. సారా తాగి చిందేస్తాం..మందంతా దిగే దాకా లోకాలే పాలిస్తాం” అని గబ్బర్ సింగ్ లో కోట శ్రీనివాసరావు పాట పాడితే అందరూ ఎంజాయ్ చేస్తారు. అయితే అలాంటి సీనే రియల్ లైఫ్ లోనూ జరిగింది. అదీ జనవరి 26 రాజ్యాంగం అమలైన రోజు. అందరూ ఉత్సవాలు జరుపుకుంటుంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ముక్కేస్కో.. చుక్కేస్కో అంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

తాము డిస్ట్రిక్ పబ్లిక్ రిలేషన్ ఉద్యోగులమనే విషయాన్ని మరిచిపోయారు. గణంతంత్ర దినోత్సవం రోజు మద్యం తాగొద్దన్న జ్ఞానం కోల్పోయారు. ఏకంగా ఆఫీస్‌ను బార్‌గా మార్చేశారు. ముక్కా-చుక్కతో ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. మీడియా కంటేపడే సరికి మత్తుదిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. గద్వాల జిల్లా కు చెందిన అధికారుల తీరు మీరే చూడండి.

జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీస్‌ను బార్‌గా మార్చేశారు. పీకలు దాకా తాగి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మామూలు రోజుల్లో కాదు ఏకంగా గణతంత్ర దినోత్సవం రోజే. పంద్రాగస్ట్, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి రోజు మద్యం సేవించకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఉద్యోగులకు. గణంతంత్ర దినోత్సవం రోజు ఎవరైనా లిక్కర్ తాగితే బుద్ధి చెప్పాల్సిన వీళ్లే కంచే చేను మేసిందన్న చందంగా ఆఫీసులో తాగితందనాలాడారు.

గద్వాల జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసుకు చెందిన సమాచార ఉద్యోగులు వెలగబెట్టిన నిర్వాహకమిది. అయ్యవార్లు చేసిందంతా చేసి.. మేం తప్పు చేశాం. మమ్మల్ని విడిచిపెట్టాలని వేడుకుంటున్నారు. దీనంతటికి ఉన్నాతాధికారుల నియంత్రణ లేకపోవడమే కారణం. రూల్స్ కేవలం జనాలకేనా. ప్రభుత్వ ఉద్యోగులకుండవా. తామేం చేసినా నడిచిపోతుందని అనుకుంటారా ఉద్యోగులు. ఎంతో కొంతో చదువుకొని గౌరవప్రదమైన ఉద్యోగం వెలగబెడుతున్న వీరు. రూల్స్ ను బ్రేక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు.



Next Story

Most Viewed