పబ్‌జీ‌లో జూన్ 1 నుంచి ‘మిస్టీరియస్ జంగిల్’ మోడ్

by  |
పబ్‌జీ‌లో జూన్ 1 నుంచి ‘మిస్టీరియస్ జంగిల్’ మోడ్
X

దిశ, వెబ్ డెస్క్:
ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్న గేమ్ యాప్‌లలో ‘పబ్ జీ’ కూడా ఒకటి. పబ్‌జీ‌కి బానిసలైన పోయినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అందుకే పబ్‌జీపై ఎన్నో విమర్శలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. అయితే పబ్ జీ మాత్రం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ న్యూ ప్లేయర్స్ కు, ఓల్డ్ ప్లేయర్స్ సరికొత్త వినోదాన్ని అందిస్తోంది. గతంలో 0.17.0 అప్‌డేట్‌ తో మన ముందుకు వచ్చిన పబ్‌జీ, జూన్‌ 1వ తేదీన కొత్త అప్‌డేట్‌తో రానుంది. ఇది కొత్త గేమ్‌ ఐటమ్స్‌తోపాటు మరో గేమ్‌ మోడ్‌ని పబ్‌జీ ప్రియులకు అందించనుంది.

పబ్‌జీ తీసుకొస్తున్న కొత్త మోడ్ పేరు ‘మిస్టీరియస్ జంగిల్ ’. అయితే ఈ జంగిల్‌మోడ్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. పబ్‌జీ టీమ్‌ సోషల్‌ మీడియాలో కొత్త మోడ్‌కు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియో ఆధారంగా చూస్తే ఇది ఒక ట్రెజర్‌ హంట్‌ లాగా కనిపిస్తోంది. దీనిలో ప్లేయర్‌ మరో ఇద్దరితో టీంగా ఏర్పడి ఇచ్చే క్లూస్‌ ఆధారంగా నిధిని కనిపెట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ మోడ్‌ షాన్‌హాంక్‌ ఆధారంగా పనిచేస్తోంది. ఇంతకుముందు గేమ్‌లో పోటీని పెంచడానికి పబ్‌జీ టీం బ్లూ జోన్‌ మోడ్‌ని తీసుకువచ్చింది.

Next Story

Most Viewed