పవర్‌స్టార్ కోసం భారీగా ఖర్చు చేస్తున్న నిర్మాత.. రిజల్ట్ ఎలా ఉంటుందో?

by  |
Pawan Kalyan
X

దిశ, సినిమా: #PSPK27 మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం.రత్నం నిర్మిస్తుండగా.. 17వ శతాబ్ధం నేపథ్యంలో వస్తున్న సినిమా కోసం హైదరాబాద్‌లో ఏకంగా చార్మినార్ సెట్ వేశారు యూనిట్ సభ్యులు. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కోసం సెట్ వేసినట్లు తెలుస్తుండగా.. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నారు. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమాలో నిధి-పవన్ కాంబినేషన్‌లో సీన్స్‌తో పాటు సాంగ్స్ చిత్రీకరణ పూర్తి కాగా.. జాక్వెలిన్ పోర్షన్ షూటింగ్ జరగాల్సి ఉంది.



Next Story

Most Viewed