ఆపరేషన్ ప్రహార్‌కు వ్యతిరేకంగా 24న నిరసనలు : మావోయిస్టు పార్టీ

by Sridhar Babu |
ఆపరేషన్ ప్రహార్‌కు వ్యతిరేకంగా 24న నిరసనలు : మావోయిస్టు పార్టీ
X

దిశ ప్రతినిధి, ఖమ్మం : ఫాసిస్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రహార్ సైనిక అభియాన్‌కు వ్యతిరేకంగా 24న అంతర్జాతీయ కార్యాచరణ దినాన్ని విప్లవ దృడసంకల్పంతో జయప్రదం చేయాలని మావోయిస్టు పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజన్ కమిటీ ఆజాద్ పేరిట ఓ లేఖ విడుదల చేసింది. భారత విప్లవోద్యమ నిర్మూలనే లక్ష్యంతో దోపిడీ పాలక వర్గాలు గ్రీన్ హంట్‌ను అమలు చేస్తున్నాయని ఈ లేఖలో పేర్కొన్నారు.

దీర్ఘకాల పథకంలో భాగంగా ప్రజలపై యుద్ధాన్ని ప్రకటిస్తూ అణచివేతే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరిస్తూ దాడులకు పాల్పడుతోందన్నారు. ఈ దాడులను వ్యతిరేకిస్తూ జాతీయ, అంతర్జాతీయంగా అనేక కార్మికవర్గ సంస్థలు, వామపక్షాలతో పాటు, ప్రజాస్వామిక, విప్లవ సంస్థలు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. పాలకులు.. విప్లవ వ్యతిరేక ఫాసిస్టు అణచివేత చర్యలను కొనసాగిస్తున్న ప్రహార్-5 ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24న కామ్రేడ్ కిషన్ 10వ వర్ధంతి నాడు కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావులు, మహిళలు, అల్పసంఖ్యాకులు, దళితులు, ఆదివాసులు అందులో పాల్గొని ఆ పిలుపును జయప్రదం చేయవలసిందిగా కోరారు.

Advertisement

Next Story

Most Viewed