19న టీపీసీసీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ఘెరావ్

86

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19వ తేదీ రాజ్ భవన్ ఘెరావ్ చేపడుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటలకు మొదలౌతుందని, లుంబినీ పార్క్ వద్ద జన సమీకరణ చేసి అక్కడ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్‌ హాజరుకానున్నారని, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..