కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

by  |
కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
X

దిశ, వేములవాడ: వేములవాడ పట్టణంలో యూత్ కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో హుజురాబాద్ యువ నేత కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా కనికరపు రాకేష్, నాగుల రాము మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాణిక్య ఠాకూర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి స్థాయిని మరిచి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.

అనంతరం వేములవాడ బ్రిడ్జి ముందు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అదేవిధంగా రద్రంగి, కోనరావుపేట, చందుర్తి, బోయినపల్లి, కథలాపూర్, మేడిపల్లి మండలంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి కిరణ్, కోలకాని రాజు, దాడి మల్లేశం, వనపర్తి శంకర్, తోట రాజేష్, గుడిసె కర్ణాకర్, వస్తాదు కృష్ణ, మేడే రాజు, మర్రిపల్లి రాజు, సందేళ దేవయ్య, యాదవ్, రాజేందర్, శ్రీనివాస్ లు ఉన్నారు.


Next Story