‘సీఎం సార్ మాట నిలబెట్టుకోండి.. మల్లంపల్లిని మండలంగా ప్రకటించండి’

by Shyam |

<p>దిశ, ములుగు : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మల్లంపల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు అన్నారు. గురువారం ములుగు మండలంలో మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత స్థానిక ఎంపీటీసీ, [&hellip;]</p>

‘సీఎం సార్ మాట నిలబెట్టుకోండి.. మల్లంపల్లిని మండలంగా ప్రకటించండి’
X

దిశ, ములుగు : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మల్లంపల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు అన్నారు. గురువారం ములుగు మండలంలో మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ప్రజా ప్రతినిధులు సైతం ముఖ్యమంత్రితో మాట్లాడి మల్లంపల్లిని మండలంగా చేస్తామని హామీ పై గెలిచారన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఒకే వేదికపై నుండి కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి హామీగా ఉన్న మల్లంపల్లిని ఆరు నెలల్లో మండలం చేస్తామని అన్నారు.

ఆరు నెలలు దాటి చాలా రోజులు అయినప్పటికీ ఎవ్వరూ మల్లంపల్లి మండల హామీ గురించి మాట్లాడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ మధ్యలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల సభలో మల్లంపల్లి మండలంగా ఏర్పాటు చేసే బాధ్యత తనపై ఉందని, మళ్ళీ హామీ ఇచ్చి ముఖం చాటేశారని అన్నారు. చివరికి సర్పంచ్ ఎన్నికల్లోనూ తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలిస్తేనే మండలం వస్తదని ఇక్కడి ప్రజల ఓట్లు దోచుకొని ఘోరంగా మోసం చేశారని విమర్శించారు. మండలం వస్తే చుట్టూ పది గ్రామాల ప్రజలు నిత్యావసరాలకు, అత్యవసరాలకు మాత్రమే కాకుండా అన్ని రకాలుగా అభివృద్ధికి నోచుకుంటారన్నారు. ఇది అందరి క్షేమం కోసం అడిగే న్యాయమైన డిమాండ్ అని అన్నారు. లేనిపక్షంలో మల్లంపల్లి మండల సాధన కోసం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు చంద రాము, ఎడ్ల అనిల్ రెడ్డి, పోనుగంటి రవి, బాషబోయిన సూరి, గూడెపు కర్నాకర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story