- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > కేంద్రం క్లారిటీ ఇచ్చేవరకు పోరాటం చేస్తాం: ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్
కేంద్రం క్లారిటీ ఇచ్చేవరకు పోరాటం చేస్తాం: ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్
<p>దిశ ఖానాపూర్: కేంద్ర ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడం, దాస్తురాబాద్, ఉట్నూర్, పెంబి మండలంలోని గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆమె కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం అజ్మీరా రేఖశ్యాం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్ల జెండాలు కట్టి నిరసన వ్యక్తం […]</p>

X
దిశ ఖానాపూర్: కేంద్ర ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడం, దాస్తురాబాద్, ఉట్నూర్, పెంబి మండలంలోని గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆమె కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం అజ్మీరా రేఖశ్యాం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్ల జెండాలు కట్టి నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. కేంద్రం మొండి వైఖరి వల్ల రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. యాసంగి పంటల కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు పోరాటం సాగిస్తామని చెప్పుకొచ్చారు.
Next Story






