- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సజ్జల రామకృష్ణారెడ్డికి నిరసన సెగ.. వరద బాధితులు ఫైర్
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు వరద బాధితుల నిరసన సెగ తగిలింది. వివరాల ప్రకారం.. సజ్జల మంగళవారం అన్నమయ్య జలాశయం కట్టతెగి ముంపునకు గురైన పులపుత్తూరు, గుండ్లూరు, మందపల్లి, తొగురుపేట గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా తాము సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తున్న పరిహారం […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు వరద బాధితుల నిరసన సెగ తగిలింది. వివరాల ప్రకారం.. సజ్జల మంగళవారం అన్నమయ్య జలాశయం కట్టతెగి ముంపునకు గురైన పులపుత్తూరు, గుండ్లూరు, మందపల్లి, తొగురుపేట గ్రామాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా బాధితులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా తాము సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమూలకు సరిపోతుందని ప్రశ్నించారు. పులపుత్తూరు గ్రామస్తులు ఆయన ఎదుటే ఆగ్రహం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా జలాశయాలు కట్టలు తెగి ప్రాణ, ఆస్తినష్టం జరిగిందన్నారు. వరదల్లో ఇళ్లను కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఐదు సెంట్ల స్థలంలో కొత్తగా ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. దీంతో గ్రామస్తులు కొంత శాంతించారు.






