కబ్జా చెర నుంచి ప్రభుత్వ భూమి పరిరక్షణ

100
Sherilingampalli1

దిశ, శేరిలింగంపల్లి: ప్రభుత్వ స్థలాలను ఎవరు ఆక్రమించినా, అందులో అనధికారిక కార్యక్రమాలు చేపట్టినా సహించేది లేదని శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. చందానగర్ పరిధిలోని సర్వే నెంబర్ 27లో శ్మశానవాటిక కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి, అందులో పశువుల పాక నిర్మాణం చేపట్టినట్లు రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు శుక్రవారం సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య అందులో ఉన్న పశువుల పాకను, చుట్టూ ఉన్న గోడను కూల్చివేశారు.