- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొరంగంలో పాడుపనులు.. అలా చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన యువతులు
<p>దిశ, వెబ్‌డెస్క్: లాడ్జీలో సొరంగం ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. కర్నాటకలోని తమకూరులో ఈ వ్యవహారం సంచలనం రేపింది. తమకూరులోని నంది లాడ్జీని వేదికగా చేసుకున్న ఓ ముఠా.. ఎవరికీ అనుమానం రాకుండా లాడ్జీ భవనంలోనే ఓ సొరంగం ఏర్పాటు చేసుకున్నారు. పలు మార్లు పోలీసులు దాడులు చేసినా సొరంగంలో వ్యభిచారం వ్యవహారం బయటపడలేదు. ఇదే ధైర్యంతో కోల్‌కతాకు చెందిన ఐదుగురు అమ్మాయిలను తీసుకొచ్చిన ముఠా సభ్యులు వ్యభిచారం […]</p>

దిశ, వెబ్‌డెస్క్: లాడ్జీలో సొరంగం ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. కర్నాటకలోని తమకూరులో ఈ వ్యవహారం సంచలనం రేపింది. తమకూరులోని నంది లాడ్జీని వేదికగా చేసుకున్న ఓ ముఠా.. ఎవరికీ అనుమానం రాకుండా లాడ్జీ భవనంలోనే ఓ సొరంగం ఏర్పాటు చేసుకున్నారు. పలు మార్లు పోలీసులు దాడులు చేసినా సొరంగంలో వ్యభిచారం వ్యవహారం బయటపడలేదు.
ఇదే ధైర్యంతో కోల్‌కతాకు చెందిన ఐదుగురు అమ్మాయిలను తీసుకొచ్చిన ముఠా సభ్యులు వ్యభిచారం మొదలుపెట్టారు. కానీ, లాడ్జీ సమీపంలోని రహదారిపై నిత్యం కండోమ్ ప్యాకెట్లు కుప్పలు-తెప్పలుగా పడి ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు మెరుపు దాడులు చేశారు. భవనాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించగా.. గోడలు, కబోడ్‌ల చాటున ఉన్న సొరంగాన్ని గుర్తించారు. వాటిని బద్ధలు కొట్టగా అందులో నుంచి ఏకంగా రెండు జంటలు బయటకు రావడంతో షాక్ అయ్యారు.
ముఠా సభ్యులు, ఇద్దరు విటులను అరెస్ట్ చేసి.. ఐదుగురు కోల్‌కతాకు చెందిన అమ్మాయిలను రక్షించారు పోలీసులు. లాడ్జీ గోడలకు రంధ్రాలు చేసి పెద్ద సొరంగాన్ని ఏర్పాటు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కర్నాటకలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి సొరంగాలు ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారా..? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
వ్యభిచారం చేస్తూ హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన స్టార్ హీరోయిన్లు..






