లాడ్జిలో యువతులతో విటులు.. అలా చేస్తుండగా పోలీసుల సడెన్ ఎంట్రీ

by  |
prostitution
X

దిశ, నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో గల ఓ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న ఎనిమిది మంది విటులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముందస్తు సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, పట్టణ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంయుక్తంగా మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచారం చేస్తున్న విటులతో పాటు యువతులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. లాడ్జిలో వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్న లాడ్జి యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పట్టణ సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed