- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిటీలో రౌడీ షీటర్ హల్‌చల్.. సొంత తమ్ముడిపై కత్తితో దాడి
<p>దిశ, రాజేంద్రనగర్ : ఇంటి స్థలం విషయంలో రౌడీషీటర్ వీరంగం సృష్టించి స్వంత తమ్ముడితో పాటు మరికొంతమందిపై దాడికి పాల్పడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివరాంపల్లి శ్రీదేవి కాలనీలో మహమ్మద్ జుబేర్ ఉద్దీన్, మహమ్మద్ జాఫర్ కుటుంబానికి చెందిన ఆరు వందల గజాల స్థలం ఉన్నది. ఇరువురు అన్నదమ్ములు సమానంగా స్థలాన్ని పంచుకోవాలని పెద్దలు నిర్ణయించగా పెద్ద కుమారుడు మహమ్మద్ జుబేర్ ఉద్దీన్ […]</p>

దిశ, రాజేంద్రనగర్ : ఇంటి స్థలం విషయంలో రౌడీషీటర్ వీరంగం సృష్టించి స్వంత తమ్ముడితో పాటు మరికొంతమందిపై దాడికి పాల్పడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివరాంపల్లి శ్రీదేవి కాలనీలో మహమ్మద్ జుబేర్ ఉద్దీన్, మహమ్మద్ జాఫర్ కుటుంబానికి చెందిన ఆరు వందల గజాల స్థలం ఉన్నది. ఇరువురు అన్నదమ్ములు సమానంగా స్థలాన్ని పంచుకోవాలని పెద్దలు నిర్ణయించగా పెద్ద కుమారుడు మహమ్మద్ జుబేర్ ఉద్దీన్ తనకు ఎక్కువ స్థలం కావాలని తన తమ్ముడు జాఫర్ అహ్మద్‌తో గత కొన్ని రోజులుగా గొడవ పడుతున్నాడు. ఇదే క్రమంలో సాయంత్రం నమాజ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న జాఫర్ అహ్మద్‌పై మహమ్మద్ జుబేర్ ఉద్దీన్ దాడికి పాల్పడ్డాడు. జాఫర్ అహ్మద్ ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టి గాయపడిన వ్యక్తులను ఆస్పత్రికి తరలించారు. మహమ్మద్ జుబేర్ ఉద్దీన్‌పై మంగళహాట్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ కేసు ఉంది. తనపై కక్ష సాధింపు చర్యతోనే మా అన్న మహమ్మద్ జుబేర్ ఉద్దీన్ తనపై దాడి చేశాడని చంపుతామని బెదిరిస్తున్నారని జాఫర్ అహ్మద్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






