మహిళా సాధికరతతోనే ప్రగతి

by  |
మహిళా సాధికరతతోనే ప్రగతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళా సాధికారతతోనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందనే విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని, అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

ఆదివారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (సీఓడబ్ల్యూఈ) సంస్థ మహిళా దినోత్సవం సందర్భంగా హైటెక్స్లో నిర్వహిస్తున్న ‘ఏ బిజినెస్ ఐడియా ఫెంప్రెన్యూర్స్ 2021’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఎంట్రప్రెన్యూర్ అవ్వాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన వ్యాపారం నేడు 12000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి ఇస్తోందని, సీఓడబ్ల్యూఈ లాంటి సంస్థల సహకారంతో మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తయారవ్వాలని మంత్రి ఆకాంక్షించారు.

మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖలు అండగా నిలుస్తాయని మంత్రి అభయమిచ్చారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో కరీంనగర్ కేంద్రంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని నెలకొల్పి గ్రామీణ మహిళల స్వయం సాధికారతకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతనిస్తుందని హామీనిచ్చారు.

దేశవ్యాప్తంగా పది చాప్టర్లు ఉన్న సీఓడబ్ల్యూఈ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉండడం ఇక్కడి మౌలిక వసతులకు ప్రత్యక్ష తార్కాణమన్నారు. కోవా నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులందరికీ అభినందనలు, మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


Next Story

Most Viewed