ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి..

by Sridhar Babu |
ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి..
X

దిశ,మణుగూరు: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో కీలకమైనవని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు కోదండరాం అన్నారు. మణుగూరు మండలంలో ఓ సమావేశంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ఆధిపత్యం, పెత్తనం నిలుపుకోవాలనే కోరిక ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న దుష్టపాలనకు చెక్ పెట్టాలని, తమ హక్కులను సాధించుకోవాలి అనే పట్టుదల ప్రజలకు ఉందన్నారు. ఏజెన్సీలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. ఊళ్లల్లో ఉండి ఉద్యోగాలు రాక చదువు నిరుపయోగంగా మారుతోందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. పట్టభద్రులు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.



Next Story

Most Viewed