- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌కు సినీ నిర్మాతల మండలి లేఖ
<p>దిశ ఏపీ బ్యూరో: ఏపీ సీఎం జగన్‌కు తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖ రాసింది. గతంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి.. స్టూడియోలకు, ల్యాబ్స్ నిర్మించుకోవడానికి స్థలాలను ఉదారంగా కేటాయించారని, అలాగే ఆర్టిస్టులు, నిర్మాతలు, ఇతర వర్గాల కోసం ఇళ్ల స్థలాలు కూడా కేటాయించారని లేఖలో గుర్తు చేశారు. అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్మాతల మండలి లేఖలో కోరింది. స్టూడియోలు, ల్యాబ్స్‌తో పాటు నిర్మాతలు, నటీనటులు, ఇతర పరిశ్రమ […]</p>

దిశ ఏపీ బ్యూరో: ఏపీ సీఎం జగన్‌కు తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖ రాసింది. గతంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి.. స్టూడియోలకు, ల్యాబ్స్ నిర్మించుకోవడానికి స్థలాలను ఉదారంగా కేటాయించారని, అలాగే ఆర్టిస్టులు, నిర్మాతలు, ఇతర వర్గాల కోసం ఇళ్ల స్థలాలు కూడా కేటాయించారని లేఖలో గుర్తు చేశారు. అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్మాతల మండలి లేఖలో కోరింది.
స్టూడియోలు, ల్యాబ్స్‌తో పాటు నిర్మాతలు, నటీనటులు, ఇతర పరిశ్రమ వర్గాలకు ఇళ్ల కోసం స్థలాలను కేటాయించాలని నిర్మాతల మండలి సీఎం దృష్టికి తీసుకొచ్చింది. జీవో నంబర్ 45 ద్వారా షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వ ప్రాంగణాలను ఉచితంగా అందించేందుకు ఆదేశాలిచ్చినందుకు తెలంగాణ సీఎంకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఏపీలో కూడా సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు స్థలాలను కేటాయించాలని కోరింది.






