ప్రభు, నయన్‌ల స్క్రీన్ షేర్.. అంతా ఒట్టిదే!

84

మాజీ లవర్స్ ప్రభుదేవా, నయనతార జంటగా కలిసి నటిస్తున్నారన్న వార్తలు ఇటీవల మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విశాల్, కార్తీ ప్రధానపాత్రల్లో మొదలైన ‘కరుప్పు రాజా వెలై రాజా’ అనే చిత్రం కొంత పార్ట్ షూటింగ్ అయిన తర్వాత రెండేళ్ల క్రితం ఆగిపోయింది. ఇప్పుడు అదే సినిమాకు కాస్త మార్పులు చేసి పట్టాలెక్కించనున్నారనే గుసగుసలు వినిపించాయి. ఈ సినిమాకు ప్రభుదేవా డైరెక్షన్‌ వహించనున్నారని, హీరోయిన్‌గా నయన్ ఓకే అయినట్లు వార్తలు వెలువడ్డాయి. విశాల్ పాత్రను ప్రభుదేవానే చేయనున్నాడని.. కార్తీ పాత్రను కొంచెం చేంజ్ చేసి నయన్‌ను సినిమా చేసేందుకు ఒప్పించారని తెలిసింది. కానీ ఇదంతా అవాస్తవమని.. దీనిపై క్లారిటీ ఇచ్చారు సినీ నిర్మాత ఈశ్వరీ కె.గణేష్. కార్తీ, విశాల్ ప్రధాన పాత్రల్లో కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ‘కరుప్పు రాజా వెలై రాజా’ ప్రాజెక్ట్‌ ఇప్పటికే ఆగిపోయిందన్న ఆయన మళ్లీ తనకు ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..