ప్రో కబడ్డీ లీగ్.. జైపూర్‌పై గుజరాత్ గెలుపు

by Shyam |

<p>దిశ, స్పోర్ట్స్: ప్రో కబడ్డీ లీగ్ 8వ సీజన్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ తమ తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని షెరటన్ గ్రాండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ జట్టుపై గుజరాత్ జెయింట్స్ 34-27 తేడాతో విజయం సాధించింది. గుజరాత్ జట్టులో రైడర్ రాకేశ్ నర్వాల్, డిఫెండర్ గిరీష్ మారుతీ చెరి ఏడు పాయింట్లు సాధించగా.. ఆల్ రౌండర్ రాకేష్ 6 పాయింట్లు రాబట్టాడు. అదే సమయంలో జైపూర్ [&hellip;]</p>

ప్రో కబడ్డీ లీగ్.. జైపూర్‌పై గుజరాత్ గెలుపు
X

దిశ, స్పోర్ట్స్: ప్రో కబడ్డీ లీగ్ 8వ సీజన్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ తమ తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని షెరటన్ గ్రాండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ జట్టుపై గుజరాత్ జెయింట్స్ 34-27 తేడాతో విజయం సాధించింది. గుజరాత్ జట్టులో రైడర్ రాకేశ్ నర్వాల్, డిఫెండర్ గిరీష్ మారుతీ చెరి ఏడు పాయింట్లు సాధించగా.. ఆల్ రౌండర్ రాకేష్ 6 పాయింట్లు రాబట్టాడు. అదే సమయంలో జైపూర్ తరఫున రైడర్ అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 10 పాయింట్లు సాధించాడు.

ఇక మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ను ఓడించింది. దబాంగ్ ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ అత్యధికంగా 16 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్ విజయ్ కూడా 9 పాయింట్లతో అతడికి అండగా నిలిచాడు. తొలి అర్దభాగంలో ఢిల్లీ 7 పాయింట్ల ఆధిక్యంతో నిలిచింది. రెండో అర్దభాగంలో పుణేరి పల్టన్ పుంజుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఢిల్లీ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఢిల్లీ 41-30 తేడాతో విజయం సాధించింది. ఇక గురువారం జరిగిన చివరి మ్యాచ్‌ చాలా ఉత్కంఠగా సాగింది. పట్నా పైరేట్స్ – హర్యానా స్టీలర్స్‌ నువ్వా నేనా అన్నట్లుగా చివరి వరకు తలపడ్డారు. హర్యానా సూపర్ టాకిల్స్ చేస్తుండగా.. పట్నా పైరేట్స్ సూపర్ రైడ్స్‌తో టెన్షన్ పుట్టించారు. ఆఖర్లో హర్యానా స్టీలర్స్ కాస్త తప్పులు చేసి పాయింట్లు పోగొట్టుకున్నది. దీంతో పట్నా పైరేట్స్ 42-39 తేడాతో హర్యానాపై విజయం సాధించింది.

Next Story