వైఫ్.. హస్బెండ్.. హిజ్ హోమోసెక్సువల్ స్టోరీ

by  |
వైఫ్.. హస్బెండ్.. హిజ్ హోమోసెక్సువల్ స్టోరీ
X

దిశ, సినిమా : ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏఎల్‌టీ బాలాజీ మరో బోల్డ్ సిరీస్ తీసుకొస్తోంది. సత్యదీప్ మిశ్రా, ప్రియమణి రాజ్ ప్రధానపాత్రల్లో వస్తున్న ‘హిజ్ స్టోరీ’ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండగా.. ఏప్రిల్ 25న విడుదల కానుంది. కునాల్, సాక్షి.. తమ ఇద్దరు పిల్లలతో పర్‌ఫెక్ట్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. అయితే అప్పటి వరకు హ్యాపీగా గడిచిన వారి లైఫ్ ఒక్క సంఘటనతో మొత్తం మారిపోతుంది.

తన భర్త ప్రీత్ అనే పురుషుడితో హోమోసెక్సువల్ రిలేషన్‌లో ఉన్నాడని తెలుసుకున్న సాక్షి.. ఆ తర్వాత తన లైఫ్‌ను ఎలా లీడ్ చేస్తుంది? భర్తను తనవైపు తిప్పుకునేందుకు, సమాజంలో తమ పరువు కాపాడుకునేందుకు చేసే ప్రయత్నం ఏంటి? అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనేది కథ. ‘పర్‌ఫెక్ట్ లవ్.. పర్‌ఫెక్ట్ లై’ నడుమ సాగే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ద్వారా సొసైటీలోన రహస్య బంధాలను బయటకు తీసుకొస్తున్నామని మేకర్స్ వెల్లడించారు.


Next Story

Most Viewed