- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామ్‌ను చూస్తే ముచ్చటేస్తుంది : ప్రియమణి
<p>నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. దీంతో కాస్త సినిమాలకు బ్రేక్ పడినా, షోస్‌తో బిజీగా గడిపింది. మళ్లీ ఇప్పుడు తన కెరియర్ సూపర్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తెలుగులో విక్టరీ వెంకటేష్ నారప్పతో పాటు రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వస్తున్న విరాటపర్వం సినిమాలో కామ్రేడ్ భారతక్కగా కీలక పాత్రలో కనిపించబోతుంది ప్రియమణి. అటు ‘ది ఫ్యామిలీ మెన్’ సిరీస్‌లో నటించి గుర్తింపు పొందిన తనకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుంచి కూడా […]</p>

నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. దీంతో కాస్త సినిమాలకు బ్రేక్ పడినా, షోస్‌తో బిజీగా గడిపింది. మళ్లీ ఇప్పుడు తన కెరియర్ సూపర్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తెలుగులో విక్టరీ వెంకటేష్ నారప్పతో పాటు రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వస్తున్న విరాటపర్వం సినిమాలో కామ్రేడ్ భారతక్కగా కీలక పాత్రలో కనిపించబోతుంది ప్రియమణి. అటు ‘ది ఫ్యామిలీ మెన్’ సిరీస్‌లో నటించి గుర్తింపు పొందిన తనకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుంచి కూడా ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి.
కాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి.. పెళ్లి తర్వాత కూడా అదే రేంజ్‌లో సత్తా చాటుతున్న హీరోయిన్ సమంతపై ప్రశంసల వర్షం కురిపించింది. తన ఫిట్‌నెస్, లుక్‌పై పూర్తి కాన్సంట్రేషన్‌తో ఉన్న సామ్‌ను చూస్తే ముచ్చటేస్తుందని.. తను ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపింది. ఒకప్పుడు హీరోయిన్‌కు ఎంగేజ్‌మెంట్ అయిందని తెలిస్తే చాలు అవకాశాలు తగ్గిపోయేవని.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదని చెప్పింది. ఫిల్మ్ మేకర్స్ మైండ్ సెట్‌లోనూ మార్పొచ్చిందని.. ఇది సంతోషకరమైన విషయమని చెప్పుకొచ్చింది ప్రియమణి.






