తెలుగు నేర్చుకునేందుకు ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెడుతున్నా : ప్రియా వారియర్

by  |
తెలుగు నేర్చుకునేందుకు ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెడుతున్నా : ప్రియా వారియర్
X

దిశ, సినిమా : ప్రెట్టీ యాక్ట్రెస్ ప్రియా ప్రకాశ్ వారియర్ కన్నుగీటిన వీడియోతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. 2018లో తన మలయాళ డెబ్యూ మూవీ ప్రోమో వీడియోతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన భామ.. ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ అదే ఇంపాక్ట్ కంటిన్యూ చేస్తోంది. యంగ్ ఏజ్‌లో ఇంత పాపులారిటీ పొందడం ఆశీర్వాదమే అంటోంది హీరోయిన్.

మూడేళ్లుగా ఆడియన్స్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ పొందడం అదృష్టం అంటున్న భామ.. ఆ ప్రేమను నిలబెట్టుకునేందుకు హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలిపింది. రీసెంట్‌గా కన్నడ, తెలుగు ఇండస్ట్రీల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రూవ్ చేసుకున్న ప్రియ.. ఈ రెండు భాషలు కూడా తనకు రావని, కానీ నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పింది. టాలీవుడ్, శాండల్‌వుడ్‌లో నటిస్తున్నప్పుడు తను పెట్టిన ఎక్స్‌ట్రా ఎఫర్ట్ కూడా ఇదేనని తెలిపింది.



Next Story