‘సోషల్’ డిస్టెన్స్ పాటిస్తున్న మలయాళీభామ!

by  |
‘సోషల్’  డిస్టెన్స్ పాటిస్తున్న మలయాళీభామ!
X

కన్నుగీటే సీన్‌తోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన సినీనటి ప్రియా ప్రకాష్ వారియర్.. ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది. ఆ సమయంలో ఎక్కడ చూసినా తన గురించే చర్చ. ఆమె కంటి చూపునకు పడిపోని కుర్రకారు లేరంటే అతిశయోక్తి కాదేమో… ఈ క్రేజ్‌తోనే సినిమా రిలీజ్ కాకముందే వరుస అవకాశాలు, యాడ్‌లు చేజిక్కించుకుంది ఈ మలయాళీ భామ.

ఓవర్‌నైట్ స్టార్ అయిపోవడంతో ప్రియకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ భామ ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌ను పది లక్షల మంది ఫాలో అవుతుండగా.. ఈ రికార్డ్ క్రియేట్ చేసిన అతికొద్ది మంది ఇండియన్ సెలబ్రిటీల్లో తనూ ఒకరు. కానీ ఉన్నట్టుండి ప్రియ ఇన్‌స్టా నుంచి వైదొలిగింది. తన అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిన ప్రియా వారియర్.. సోషల్ మీడియాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అయితే ఇందుకు కారణం మాత్రం తెలియరాలేదు. కానీ ట్రోల్స్ తట్టుకోలేకే తప్పుకున్నట్లు సమాచారం.

అయితే ఇది తాత్కాలికమేనని.. త్వరలో మళ్లీ చేరుతుందని చెప్తున్నారు తన మిత్రులు. కానీ ఇన్‌స్టా నుంచి వైదొలిగిన ప్రియ ఫేస్‌బుక్, టిక్ టాక్ అకౌంట్స్ మాత్రం యాక్టివ్‌గానే ఉన్నాయి.


Next Story