జీవితంలో ఫెయిలైన ప్రైవేట్ టీచర్.. సూసైడ్!

by  |
జీవితంలో ఫెయిలైన ప్రైవేట్ టీచర్.. సూసైడ్!
X

దిశ, మునుగోడు: కరోనా మహమ్మారి పుణ్యమా అని స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. దీంతో ప్రైవేటు ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు. చాలా మంది బతికుదెరువు కోసం ఏదో ఒక పని చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. కానీ, పాఠాలు బోధించడం తప్ప వేరే పని తెలియని ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు విధిని ఎదురించి జీవనం సాగించడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఇటీవలె మునుగోడు మండలంలో ఓ ప్రైవేటు టీచర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా మరో ప్రైవేట్ టీచర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లిలో బుధవారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే.. పోలోజు సాయికుమార్(29) చౌటుప్పల్‌లో ప్రైవేటు ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. కరోనా మహమ్మారి దృష్ట్యా లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా వలన స్కూళ్లు ఇంకా ఓపెన్ కాలేదు. దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర మానసికవేదనకు గురయ్యాడు. దాంతో మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సాయికుమార్‌కు మూడు నెలల కిందటే వివాహం జరిగింది. భార్య దసరా పండుగకు తన పుట్టింటికి వెళ్ళింది. నిన్న రాత్రి భోజనం చేశాక తన గదిలో నిద్రపోయాడు. ఉదయం సాయికుమార్ గదిని తెరిచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి అనంత చారి వెల్లడించాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఎస్సై నవీన్ బాబు తెలిపారు.


Next Story

Most Viewed