రవీంద్ర భారతి ఎదుట టీచర్ ఆత్మహత్యాయత్నం..

by Vadlamudi Anukaran |   (  Updated:2020-09-10 02:14:08  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ తనకు ఉద్యోగం రావడం లేదనే మనస్థాపంతో ఓ ప్రయివేటు టీచర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఎదుట గురువారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు మంటలు ఆర్పి అతన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అతని శరీరం సగం కాలిపోగా ఆ సయమంలోనూ ‘ జై కేసీఆర్ సార్.. జై తెలంగాణ’ అంటూ బాధితుడు నినాదాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించి [&hellip;]</p>

రవీంద్ర భారతి ఎదుట టీచర్ ఆత్మహత్యాయత్నం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ తనకు ఉద్యోగం రావడం లేదనే మనస్థాపంతో ఓ ప్రయివేటు టీచర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఎదుట గురువారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు మంటలు ఆర్పి అతన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అతని శరీరం సగం కాలిపోగా ఆ సయమంలోనూ ‘ జై కేసీఆర్ సార్.. జై తెలంగాణ’ అంటూ బాధితుడు నినాదాలు చేశాడు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. కాగా, నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాల కోసం ఇంకా ఆత్మహత్యలు జరుగుతుండటంపై నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడితున్నాయి.

Read Also..

ఒకే గొడుగు కిందకు సాగునీటి విభాగాలు..!

Next Story