యాదాద్రి జిల్లాలో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య

by  |
Ravivarma Reddy
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి ఎందరి ప్రాణాలనో తీస్తోంది. వైరస్ విజృంభన, లాక్‌డౌన్‌తో లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఉపాధి లేక కష్టాల పాలవుతున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్ ఉద్యోగాన్ని కోల్పోయి కుటుంబాన్ని పోషించలేక ప్రాణం తీసుకున్నారు. యాద్రాద్రి భువనగిరి జిల్లాలో జరిగిందీ ఘటన.

మామిడి రవివర్మరెడ్డి(30)ది వలిగొండ మండలం కంచనపల్లి. ఆయన గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కరోనాతో పాఠశాలలు మూసివేయడంతో ఉపాధి కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కుటుంబపోషణ భారంగా మారింది.

ఈ క్రమంలో బుధవారం(మే 19,2021) హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చిన రవిరవ్మ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. రవివర్మకు భార్య, కొడుకు ఉన్నారు. రవివర్మ మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


Next Story

Most Viewed