ఆర్థిక ఇబ్బందులు.. ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచ మానవాళి జీవన విధానాన్ని అతలాకుతలం చేసింది. దీని మూలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పటికే అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గంగోరిగూడెం గ్రామానికి చెందిన మర్రి వెంకట్ ఆదివారం ఉదయం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసిన వెంకట్, నార్కట్‌పల్లిలో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కాగా గత ఏడు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని [&hellip;]</p>

ఆర్థిక ఇబ్బందులు.. ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచ మానవాళి జీవన విధానాన్ని అతలాకుతలం చేసింది. దీని మూలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పటికే అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గంగోరిగూడెం గ్రామానికి చెందిన మర్రి వెంకట్ ఆదివారం ఉదయం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసిన వెంకట్, నార్కట్‌పల్లిలో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కాగా గత ఏడు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

Next Story