కేసీఆర్ సార్.. మేము ఆత్మహత్య చేసుకుంటున్నాము.. వీడియో వైరల్

152

దిశ, వెబ్ డెస్క్ : కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రైవేట్ టీచర్ చంద్రశేఖర్ తాను ఉద్యోగం కోల్పోవడంతో తన కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ సందర్భంగా ఓ వీడియోను రికార్డ్ చేశారు. తాను 20 ఏళ్లుగా ప్రైవేటు టీచర్ ఉద్యోగం చేస్తున్నట్టు తెలిపారు. కరోనా కారణంగా తాను ఉద్యోగం కోల్పోవడంతో ఇంటి పోషణ, ఖర్చులు, ఇంటి అద్దె కట్టడం కూడా భారంగా ఉందని అన్నారు. కేసీఆర్ సార్.. దయచేసి మమ్మల్ని ఆదుకోండి లేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..