కరోనా కాటు.. టీచర్ టు టిఫిన్ సెంటర్..!

by  |
కరోనా కాటు.. టీచర్ టు టిఫిన్ సెంటర్..!
X

దిశ, హుజూరాబాద్ : కరోనా దెబ్బతో ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అలాగే ఎంతోమంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్ పట్టణంలోని సూపర్ బజార్‌లో నివాసం ఉంటున్న మట్టెల సంపత్, శంకరపట్నం మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాలను నడిపించేవారు. కరోనా రక్కసి మూలంగా పాఠశాల గత సంవత్సరం మూతపడింది. పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు అప్పులు చేసి మరి వారి జీతాలను అందించి, పాఠశాలను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం పట్టణంలోని వరంగల్‌కు వెళ్లే రోడ్డులో “నిరుద్యోగి @ M.Sc,B.ed, BLisc” పేరుతో టిఫిన్ సెంటర్ పెట్టి జీవనోపాధి కొనసాగిస్తున్నాడు. సంపత్ 18 సంవత్సరాల పాటు టీచింగ్ చేశారు. టీచింగ్ చేసిన సమయంలో ప్రతి నెలా రూ.35 వేలకు పైగా వేతనం అందుకునేవారు. ప్రస్తుతం నడుపుతున్న టిఫిన్ సెంటర్ లో రోజుకి రూ .2వేల నుంచి 3 వేల వరకు ఆదాయం వస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed