ద్రోహం చేసిన వ్యక్తిని క్షమించిన హీరో… పోస్ట్ వైరల్

by  |
ద్రోహం చేసిన వ్యక్తిని క్షమించిన హీరో… పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా : లేటెస్ట్ యాప్ ‘క్లబ్‌హౌజ్‌’లో తన ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి ఫాల్స్ మెసేజ్‌లు పంపిన వ్యక్తిని కూడా క్షమించి, ఆల్ ది బెస్ట్ చెప్పాడు మాలీవుడ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. సూరజ్ నాయర్ అనే వ్యక్తి తనకు తెలియకుండా తన పేరుతో మెసేజ్‌లు పంపుతున్నాడని క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టాడు. ‘డియర్ సూరజ్.. ఇంత వరకు హానిచేయని జోక్ బాగానే ఉంది కానీ, ఇలాంటివి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. 2500 మంది ఫాలోవర్స్ మీ మాట వింటున్నారు. మెజారిటీ ప్రజలు నేను మాట్లాడుతున్నా అనుకుంటున్నారు. దీని గురించి చాలా మంది నుంచి కాల్స్ వచ్చాయి. కాబట్టి ఇది ఆపివేయడం అత్యవసరం. ఇది పొరపాటు అని నువ్వు అంగీకరించినందుకు సంతోషం. మిమిక్రీ అనేది ఓ అద్భుతమైన కళ.. మిమిక్రీ ప్రపంచం నుంచి వచ్చి మలయాళం ఇండస్ట్రీలో చాలా మంది సక్సెస్ అయ్యారు. పెద్దగా కలలు కనండి. కష్టపడి పనిచేయడం, నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. మీరు భవిష్యత్‌లో మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నా.’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. తాను క్లబ్ హౌజ్‌లో లేనని క్లారిటీ ఇచ్చిన పృథ్వీరాజ్.. ఆన్‌లైన్ దుర్వినియోగాన్ని క్షమించనని, దయచేసి ఇలాంటి పనులు మానుకోవాలని సూచించారు.

Next Story

Most Viewed