ప్రీతమ్ సంచలన పోస్ట్.. సమంతతో నా రిలేషన్‌షిప్ గురించి చైతూకు తెలుసు

1144

దిశ, వెబ్‌డెస్క్ : ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న జంట అక్కినేని నాగచైతన్య సమంత. వీరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత వీరు ఎందుకు విడిపోతున్నారు అనేది ప్రజలకు, అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే స‌మంత‌- చైతూ విడాకుల వ్య‌వ‌హారం వెనుక సామ్ స్టైలిస్ట్ ప్రీత‌మ్ ఉన్నాడ‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.  అయితే ఈ విషయంపై సమంత రెండు రోజుల క్రితం స్పందించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అలాంటి వార్తలు ప్రచారం చేస్తే, తాను ఊరుకోనంటూ హెచ్చరించింది.

తాజాగా ఈ విషయంపై ప్రీతమ్ స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రీత‌మ్ త‌నపై వ‌స్తున్న రూమ‌ర్స్‌పై నాగ చైత‌న్య స్పందిస్తే ఇవి ఆగుతాయ‌ని అనుకుంటున్నాను అని తెలిపారు. అంతే కాకుండా సమంత, తన విషయంలో వచ్చిన రూమర్స్ గురించి స్పందిస్తూ ఓ పోస్ట్ చేశాడు. సమంతతో తనకున్న  బంధం గురించి అక్కినేని నాగ చైతన్య‌కు బాగా తెలుసని చెప్పిన ప్రీతమ్.. సమంతను ఎప్పుడూ సిస్టర్ అని పిలుస్తానని చెప్పుకొచ్చాడు. కానీ కొంతమంది కావాలనే తమ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు రాస్తున్నారని మండిపడ్డాడు . ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..