ఆరోగ్య వన్ పార్కును ప్రారంభించిన ప్రధాని

76

దిశ, వెబ్‎డెస్క్ : గుజ‌రాత్ రాష్ట్రం న‌ర్మ‌దా జిల్లాలోని కెవాడియాలో ఆరోగ్య వ‌న్ పార్కును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంత‌రం అక్క‌డ‌ ఏర్పాటు చేసిన టూరిస్టు వాహ‌నంలో పార్కు అంతటా తిరిగారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఔషధ మొక్కలు, పొదలు.. వాటి ప్రాముఖ్యతను తెలియజేయడం కోసమే ఈ పార్కును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం విజ‌య్ రూపానీ, గ‌వ‌ర్న‌ర్ ఆచార్య దేవ్‌వ్ర‌త్ పాల్గొన్నారు.