బడికి రండి.. ప్రైమరీ టీచర్లకు సర్కార్ హుకుం

by  |
బడికి రండి.. ప్రైమరీ టీచర్లకు సర్కార్ హుకుం
X

దిశ, తెలంగాణబ్యూరో : ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులందరూ నేటి నుంచి విధులకు హాజరుకాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటి వరకు ప్రైమరీ స్కూల్ టీచర్స్ 50శాతం మంది మాత్రమే హజరయ్యేవారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో టీచర్లందరూ బడులకు హాజరుకానున్నారు. ఆరో తరగతి కంటే పై తరగతుల ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ప్రభుత్వం దశల వారీగా అనుమతినిచ్చింది.

కొవిడ్ నిబంధనల ప్రకారం 20మంది విద్యార్థులకు ఒక టీచర్ మాత్రమే పాఠాలు బోధించాల్సి ఉంటుంది. విద్యాసంస్థలు ప్రారంభమయ్యాక విద్యా వాలంటీర్స్‌ను విధుల్లోకి తీసుకోకపోవడంతో ఉన్నత పాఠశాలల్లో టీచర్స్ కొరత తీవ్రతరమైంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రైమరీ స్కూల్ టీచర్స్‌ను డిప్యూటేషన్ ద్వారా ఉన్నత పాఠశాలలకు బదిలీ చేసింది. ఇందుకు సంబంధించి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.


Next Story

Most Viewed