దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : రాష్ట్రపతి

by  |
దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : రాష్ట్రపతి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా మహమ్మారి కట్టడికి, వ్యాక్సిన్ రూపకల్పనలో మన శాస్త్రవేత్తల కృషి మరువలేనిదని ప్రశంసించారు. అతి తక్కువ సమయంలోనే వైరస్‌కు వ్యాక్సిన్‌ను రూపొందించామని అన్నారు. కోవిడ్ నివారణకు వైద్య, పోలీస్, పారిశుధ్య సిబ్బంది చేసిన పోరాటం అభినందనీయం అని, కరోనాపై మనవాళ్లు అలుపెరగని పోరాటం చేశారన్నారు. దేశంలో మహమ్మారి మూలంగా లక్షన్నరకు పైగా మరణించారని, అందరి కృషి వల్లే ప్రస్తుతం కరోనా మరణాలు తగ్గాయని వెల్లడించారు. దేశంలో నిర్మాతల సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని అన్నారు. ప్రతిఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని, రాజ్యాంగ విలువలు పాటించాలని కోరారు. కఠోర పరిస్థితుల్లోనూ సరిహద్దులను జవాన్లు కాపాడుతున్నారని తెలిపారు. దేశ ప్రజలంతా రైతులకు రుణపడి ఉండాలని అభిప్రాయపడ్డారు. రైతులు, సైనికులు దేశానికి వెన్నెముక అన్నారు. గతేడాది ప్రపంచమంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది అని గుర్తుచేశారు.


Next Story

Most Viewed