రాష్ట్రపతి ఆమోదముద్ర.. సుప్రీంకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు..

by  |
supreme court
X

దిశ, వెబ్‌డెస్క్ : సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం సిఫార్సుకు ఎట్టకేలకు కేంద్రం ఆమోదం లభించింది. గురువారం దీనికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదమోద్ర వేశారు. తాజా నియామకంలో మొత్తం 9 మంది న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.

ఆగస్టు 17న కొలీజియం ఈ న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్రానికి సిఫారసు చేసింది. మొదటి జాబితాలో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ మరియు జస్టిస్ బేలా త్రివేది అనే ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. తాజా నియామకంతో సుప్రీంకోర్టులో ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరగా.. ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34కు చేరింది.


Next Story

Most Viewed