పెళ్లికి దూరం.. సోలో లైఫే సో బెటర్ అంటున్న అమ్మాయిలు

by  |
పెళ్లికి దూరం.. సోలో లైఫే సో బెటర్ అంటున్న అమ్మాయిలు
X

దిశ, వెబ్‌డెస్క్ : నేటి తరం అమ్మాయిలు పాశ్చాత్య కల్చర్‌కు బాగా అలవాటు పడిపోయి పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడటం లేదని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. ఇలా చేయడం మంచిది కాదని, భారతీయ సంస్కృతికి విఘాతం కలిగిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.

పెళ్లికి దూరంగా ఉండేందుకు ప్రస్తుత తరం వారు ఇష్టపడుతున్నారని, సోలో లైఫే సో బెటర్ అనే ఫీలింగ్ లో నేటి తరం అమ్మాయిలు ఉన్నారని, ఈ విషయాన్ని పలు సర్వేలు కుండబద్దలు కొడుతున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా, ఒకవేళ తల్లిదండ్రుల ఒత్తిడితో పెళ్లి చేసుకున్నా గర్భం దాల్చేందుకు సుముఖత వ్యక్తంచేయడం లేదని, సరోగసి రూపంలో పిల్లలకు జన్మనిద్దామని అనుకుంటున్నారని తెలిపారు. చివరకు కన్న తల్లిదండ్రులను కూడా వారితో ఉంచుకునేందుకు చాలా మంది ఇష్టపడటం లేదని స్పష్టంచేశారు.



Next Story

Most Viewed