ఫేక్ న్యూస్‌పై 'వంటలక్క' ఫైర్

by  |
ఫేక్ న్యూస్‌పై వంటలక్క ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగునాట ‘కార్తీక దీపం’ సీరియల్‌కు ఉన్న క్రేజ్‌తో ఈ మధ్య చాలా ఫేక్ న్యూస్ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా ఫేక్ అంటూ కొట్టిపారేసింది వంటలక్క. ‘కార్తీక దీపం’ సీరియల్ నుంచి వెళ్లిపోతానని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఫేస్ బుక్ లైవ్‌ ద్వారా ఫ్యాన్స్‌ను పలకరించిన ఆమె… ఈ విషయాన్ని తెలిపింది. ఓ ఫోన్ కాల్ ద్వారా ఈ న్యూస్ గురించి తెలుసుకున్నానని… ఇది ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పింది.

తెలుగులో నంబర్ వన్ సీరియల్ అయిన ‘కార్తీక దీపం’ నుంచి నేనెందుకు తప్పుకుంటానని ప్రశ్నించింది. నాకు కాల్స్, మెసేజెస్ చేసి ఫ్యాన్స్ బాధపడుతున్నారని.. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. ఎక్కడి నుంచి ఈ ప్రచారం మొదలవుతుందో అర్ధం కావడం లేదని… అసలు ఆ న్యూస్ అప్ లోడ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకుంటానంది. ప్రస్తుతం కేరళలో సీరియల్ షూటింగ్‌లోనే ఉన్నానని తెలిపిన వంటలక్క.. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మరాదని అభిమానులకు సూచించింది. న్యూస్ స్ప్రెడ్ చేసిన యూ ట్యూబ్ ఛానల్‌పై ‘కార్తీక దీపం’ టీం చర్యలు తీసుకోవడం ఖాయమని చెప్పింది.

tags : Karthika Deepam, Premi Viswanath, Vantalakka


Next Story

Most Viewed