ఇక సినిమాల్లోనూ 'వంటలక్క'

by  |
ఇక సినిమాల్లోనూ వంటలక్క
X

తెలుగు సీరియళ్లలో ‘కార్తీక దీపం’ పాపులారిటీ చెప్పక్కర్లేదు. రా. గం. 7:30 నిమిషాలు అయిందంటే చాలు… ఇంట్లో ఎంత పని ఉన్నా పక్కకు పెట్టేసి టీవీల దగ్గర అతుక్కుపోతారు మహిళలు. సీరియల్ అయిపోయే వరకు ఏ పని ముట్టుకోరు. ఈ సీరియల్‌లో వంటలక్క గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆమె నటనకు ఫిదా అయిన జనాలు… ఎక్కడ కలిసినా వంటలక్క నిన్న సీరియల్‌లో ఇలా ఏడ్చింది పాపం… డాక్టర్ బాబు ఇలా అన్నారు అంటూ చర్చ షురూ చేసేస్తారు అంటే అతిశయోక్తి కాదు. ఆమెకున్న పాపులారిటీ అలాంటిది మరి.

అయితే వంటలక్క ఇప్పుడు ‘కార్తీక దీపం’ సీరియల్‌తో బుల్లితెరపైనే ఆగిపోకుండా… సినిమాల్లోను ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. వెండితెరపై సత్తా చాటేందుకు సిద్ధమయింది. మలయాళంలో ‘సాల్మన్’ అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేయబోతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన వంటలక్క( ప్రేమి విశ్వనాథ్ ) …. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. నటుడు రాజివెట్టన్‌తో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి. దీంతో వంటలక్క ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఆల్ ద బెస్ట్ వంటలక్క అంటూ విష్ చేస్తున్నారు.

తెలుగులోనే కాదు మలయాళంలోనూ సీరియల్ చేస్తోంది ప్రేమి విశ్వనాథ్. ప్రస్తుతం కారుతుముత్తు సీరియల్‌లో నటిస్తున్న ఆమె.. యాంకర్‌గాను రాణిస్తోంది. మరి ఈ బుల్లితెర వంటలక్క… వెండితెరపై ఏ మాత్రం రాణిస్తుందో చూడాలి.


Next Story