- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ పర్యటన.. అర్ధరాత్రి అరెస్ట్‌లు
<p>దిశ, హాలియా: కేసీఆర్ పర్యటనతో హాలియాలో కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. నేడు హాలియాలో జరిగే సీఎం కేసీఆర్ ప్రగతి సమీక్ష సమావేశాన్ని అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్నాయక్ పేర్కొన్నాడు. దీంతో ముందస్తుగానే నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను, యువజన నాయకులను అర్ధరాత్రి 12 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. అనంతరం వారిని మిర్యాలగూడ పోలీస్ స్టేషన్, నల్గొండ డీ.టీ.సీకి తరలించడం జరిగింది. అక్రమ […]</p>

దిశ, హాలియా: కేసీఆర్ పర్యటనతో హాలియాలో కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. నేడు హాలియాలో జరిగే సీఎం కేసీఆర్ ప్రగతి సమీక్ష సమావేశాన్ని అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్నాయక్ పేర్కొన్నాడు. దీంతో ముందస్తుగానే నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను, యువజన నాయకులను అర్ధరాత్రి 12 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. అనంతరం వారిని మిర్యాలగూడ పోలీస్ స్టేషన్, నల్గొండ డీ.టీ.సీకి తరలించడం జరిగింది. అక్రమ అరెస్టులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేయడమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తూ నియంత పోకడలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని, అక్రమ అరెస్టులు చేయడం సరికాదని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. అరెస్టైన వారిలో యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్, జిల్లా సహాయ కార్యదర్శి పోదిల కృష్ణ, వర్కాల శ్రీనివాస్ రెడ్డి, నకిరేకంటి సైదులు, జగదీశ్వర్ రెడ్డి, పగడాల నాగరాజ్ యాదవ్ తదితరులు ఉన్నారు.






