- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
108 అంబులెన్సులో గర్భిణీకి ప్రసవం.. తల్లీ బిడ్డా క్షేమం
<p>దిశ, బోధన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ గర్భిణీ మహిళ 108 అంబులెన్సులోనే డెలివరీ అయ్యింది. పండంటి ఆడబిడ్డకు జన్మించినట్టు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. సోముపూర్ గ్రామానికి చెందిన శ్రీదేవి (భర్త దత్తాత్రేయ)కి ఇంట్లో అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా వారు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. గర్భిణీ మహిళను అంబులెన్సులో ఎక్కించుకుని తమ ఇంటి నుంచి తరలించే క్రమంలో పురిటినొప్పులు తీవ్రతరం కావడంతో అంబులెన్స్ సిబ్బంది వాహనంలోనే […]</p>

X
దిశ, బోధన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ గర్భిణీ మహిళ 108 అంబులెన్సులోనే డెలివరీ అయ్యింది. పండంటి ఆడబిడ్డకు జన్మించినట్టు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. సోముపూర్ గ్రామానికి చెందిన శ్రీదేవి (భర్త దత్తాత్రేయ)కి ఇంట్లో అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా వారు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు.
గర్భిణీ మహిళను అంబులెన్సులో ఎక్కించుకుని తమ ఇంటి నుంచి తరలించే క్రమంలో పురిటినొప్పులు తీవ్రతరం కావడంతో అంబులెన్స్ సిబ్బంది వాహనంలోనే డెలివరీ చేశారు. సాధారణ ప్రసవం ద్వారా పండంటి ఆడపిల్లకు ఆ మహిళ జన్మనిచ్చిందని వెంకటేశ్వర్లు, పైలెట్ కేశవ్ కుమార్ తెలిపారు.అనంతరం తల్లిబిడ్డలను బోధన్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
Next Story






