- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గర్భిణీ ప్రాణాలు తీసిన స్కానింగ్..
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. భర్త స్కానింగ్‌కు తీసుకువెళ్లలేదని ఓ గర్భిణీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం సూరారంకాలనీ శ్రీ సాయినగర్‌కాలనీలో ఉంటున్న శిరీష, నాగార్జున దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కూతురు హరిత ఉంది. ప్రస్తుతం శిరీష ఏడు నెలల గర్భవతి కావడంతో ఆమె భర్తను స్కానింగ్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్లాలని కోరింది. కానీ, భర్త వేరే పనిలో ఉండి తరవాత వెళ్దాం అంటూ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. భర్త స్కానింగ్‌కు తీసుకువెళ్లలేదని ఓ గర్భిణీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం సూరారంకాలనీ శ్రీ సాయినగర్‌కాలనీలో ఉంటున్న శిరీష, నాగార్జున దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కూతురు హరిత ఉంది. ప్రస్తుతం శిరీష ఏడు నెలల గర్భవతి కావడంతో ఆమె భర్తను స్కానింగ్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్లాలని కోరింది. కానీ, భర్త వేరే పనిలో ఉండి తరవాత వెళ్దాం అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఇక మూడు రోజులుగా భర్తను అడిగి, అడిగి విసిగిపోయిన శిరీష తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






