- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమపెళ్ళి.. గర్భం దాల్చాక మొహం చాటేసిన భర్త
<p>దిశ, మానకొండూరు: ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఎదురించి ప్రేమవివాహం చేసుకున్నారు. రెండేళ్లపాటు వీరి దాంపత్య జీవనం బాగానే సాగింది. ప్రస్తుతం ఆ యువతి గర్భం దాల్చింది. అంతా బానే ఉంది అనుకునేలోపే భర్త మొహం చాటేసాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది.ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని మానకొండూరు మండలం ఖాదర్ గూడానికి చెందిన ఆవుర గొండ సురేష్, రవళి ప్రేమించి […]</p>

దిశ, మానకొండూరు: ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఎదురించి ప్రేమవివాహం చేసుకున్నారు. రెండేళ్లపాటు వీరి దాంపత్య జీవనం బాగానే సాగింది. ప్రస్తుతం ఆ యువతి గర్భం దాల్చింది. అంతా బానే ఉంది అనుకునేలోపే భర్త మొహం చాటేసాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది.ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో శనివారం వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. జిల్లాలోని మానకొండూరు మండలం ఖాదర్ గూడానికి చెందిన ఆవుర గొండ సురేష్, రవళి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. రెండేళ్లు కాపురం చేశాక భర్త మొహం చాటేసాడు. తనను కులాంతర వివాహం చేసుకుని గర్భం దాల్చిన తరువాత ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఎలాగైనా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రవళిని స్టేషన్ కు పిలిపించి న్యాయం చేస్తామని హామీఇచ్చారు.






