రొయ్యల వేపుడు..

by  |
రొయ్యల వేపుడు..
X

సీ ఫుడ్‌‌ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. సీఫుడ్ చేపల తరువాత చెప్పుకునేది రొయ్యలనే. రొయ్యలను చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు:

రొయ్యలు -500 గ్రాములు
కారం పొడి – 2 టేబుల్ టీ స్పూన్లు
నూనె -50 మిల్లీ లీటర్
ఉల్లిపాయ -1
అల్లం – 1ఇంచ్
వెల్లుల్లి -8 రెబ్బలు
కొబ్బరి తురుము -1 టీ స్పూన్
పసుపు -అర టీస్పూన్
జీలకర్ర పొడి -అర టీస్పూన్
ఉప్పు -తగినంత
నిమ్మరసం – 3 టీ స్పూన్‌లు

తయారీ చేసే విధానం:

రొయ్యల్ని ముందుగా శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోవాలి. ఒక గిన్నెలో రొయ్యలు, పసుపు, ఉప్పు వేసి కలిపి పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. మరోవైపు ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిలను సన్నగా తరగాలి. కొబ్బరి తురుము, జీలకర్ర పొడి, కారం పొడిని కలిపి ముద్దగా నూరి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బాణిలో నూనె వేడి చేసుకుని అందులో తరిగిన ఉల్లి, అల్లం, వెల్లుల్లి ముక్కలను వేయించుకోవాలి. తర్వాత దానిలో కొబ్బరి తురుము మసాలా ముద్దను వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వీటిలో ముందుగా పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. సన్నని మంట మీద రొయ్యలను ఉడికించుకోవాలి. మసాలా అంతా రొయ్యలకు పట్టేంతవరకు ఉడికించాలి. అనంతరం ఈ మిశ్రమంలో నిమ్మరసం పోసి కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి రొయ్యల వేపుడు రెడీ..



Next Story

Most Viewed