‘కేజీఎఫ్2’ క్లైమాక్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఖుష్!

by  |
‘కేజీఎఫ్2’ క్లైమాక్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఖుష్!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కేజీఎఫ్ చాప్టర్-2’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రాకీ, అధీరల మధ్య క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలుపుతూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. డెడ్లీ ఫైట్ మాస్టర్స్ అన్బు మణి, అరివ్ మణి నేతృత్వంలో క్లైమాక్స్ సీన్స్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలలో చిత్రీకరిస్తుండగా.. ఈ యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. దీంతో జనవరి 8న హీరో యశ్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీర పాత్రలో కనిపించనుండగా.. ప్రకాశ్ రాజ్, రవీనా టాండన్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

మరోవైపు ప్రశాంత్ నీల్ ట్వీట్‌తో రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ కంప్లీట్ అవుతోంది కాబట్టి.. జనవరి నుంచి ప్రభాస్ ‘సలార్’ షూటింగ్ స్టార్ట్ చేస్తారని అభిప్రాయపడుతున్నారు. మోస్ట్ వయొలెంట్‌గా వస్తున్న ప్రభాస్‌కు తగినట్లుగా పవర్‌ఫుల్ విలన్‌ను ప్లాన్ చేయాలని కోరుతున్నారు. యష్ మూవీ రిలీజ్ టైమ్‌కు ప్రభాస్ టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని.. థియేటర్లలో పండగ చేసుకోవచ్చని అంటున్నారు. ఇలా చేస్తే రెండు సినిమాలకు కూడా ప్లస్ అవుతుందని ప్రశాంత్ నీల్‌కు సూచిస్తున్నారు ఫ్యాన్స్.

Next Story

Most Viewed