ఇంట్రెస్టింగ్ "కరోనా వ్యాక్సిన్"

by  |
ఇంట్రెస్టింగ్ కరోనా వ్యాక్సిన్
X

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన తొలి సినిమా అ! తోనే తానేంటో నిరూపించాడు. నాని నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ సినిమా పలు విభాగాల్లో జాతీయ అవార్డులు కూడా అందుకోగా.. రెండో సినిమా కల్కితో మరో హిట్ అందుకున్నాడు. తర్వాత తమన్నాతో దటీజ్ మహాలక్ష్మి సినిమా చేసిన ఇంకా విడుదల కాలేదు. అయితే (మే 29) తన పుట్టిన రోజు సందర్భంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ మోషన్ పిక్చర్ రిలీజ్ చేశాడు.

కరోనా వ్యాక్సిన్ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ.. మోషన్ పిక్చర్ తో ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. యదార్థ గాథల నుంచి కథ రాసుకున్న ఆయన .. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులను మోషన్ పిక్చర్ లో చూపించాడు. కరోనా రక్కసి ప్రభావంతో రెడ్ సిగ్నల్ పడి.. కరోనా కరాళనృత్యం చేస్తుంటే మానవ వ్యవస్థ స్తంభించినట్లు చూపించాడు. కరోనా ప్రారంభమైన సమయం నుంచి వ్యాక్సిన్ కనిపెట్టే వరకు నెలకొన్న పరిస్థితులను తన సినిమాలో చూపించబోతున్న ప్రశాంత్ వర్మ.. కొవిడ్ 19 కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు.. వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో శాస్త్రవేత్తల అనుభవాలు తెరపై చూపించబోతున్నారు. కాగా త్వరలోనే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు వెల్లడించనున్నారు.

https://twitter.com/PrasanthVarma/status/1266218553797050368?s=19

ఇదిలా ఉంటే అ! సినిమా సీక్వెల్ కు కూడా కథ సిద్ధం చేసుకున్నారట ప్రశాంత్. మంచి నిర్మాత దొరికితే ఈ సినిమాను కూడా పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నాడు.



Next Story

Most Viewed