ప్రకాష్ రాజ్‌కు ‘ఎనిమీ’ ఇన్విటేషన్

by  |
ప్రకాష్ రాజ్‌కు ‘ఎనిమీ’ ఇన్విటేషన్
X

దిశ, వెబ్‌డెస్క్ : రియల్ ఫ్రెండ్స్ రీల్ ఎనిమీస్ అయిపోయారు. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన కోలీవుడ్ హీరోలు ఆర్య, విశాల్.. సినిమా కోసం బెస్ట్ ఎనిమీస్ అయ్యారు. ఆనంద్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న మల్టీస్టారర్ యాక్షన్ థ్రిల్లర్‌కు ‘ఎనిమీ’ అనే టైటిల్ ఖరారు చేస్తూ అనౌన్స్‌మెంట్ చేసింది మూవీ యూనిట్. ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఎనిమి.. చెన్నైలో వారం రోజుల క్రితం సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది. కాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్న ప్రకాష్ రాజ్‌కు వెల్‌కమ్ చెప్తూ మరో అప్‌డేట్ ఇచ్చింది.

చెన్నైలో డిసెంబర్ నెల ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ప్రకాష్ రాజ్‌తో షూటింగ్ ఉంటుందని తెలిపిన డైరెక్టర్.. ఆ తర్వాత ఊటీలో చిత్రీకరణ జరుగుతుందని చెప్పారు. అయితే ఈ సినిమాలో విశాల్ హీరోగా, ఆర్య విలన్‌గా కనిపిస్తున్నారని టాక్ వినిపిస్తుండగా.. అది వాస్తవం కాదన్నారు ఆనంద్ శంకర్. సినిమాలో ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందని, అయితే కొన్ని సంఘటనల కారణంగా శత్రువులు అవుతారని.. ఆ సంఘర్షణ ఏంటి? అనేది కథ కాగా, దాన్ని ఇంట్రెస్టింగ్‌గా ప్రజెంట్ చేయబోతున్నామని చెప్పారు. చెన్నైలో వారం రోజుల నుంచి చిత్రీకరణ జరుగుతుండగా.. ఫైట్ మాస్టర్ రవి వర్మ ఆధ్వర్యంలో విశాల్‌పై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు.

https://twitter.com/VishalKOfficial/status/1331561055051337733?s=19



Next Story

Most Viewed